ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ లో విజయం సాధించి వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా.  ప్రస్తుతం ఐదు వన్డేల టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్ లో కూడా అదరగొడుతోంది  టీమిండియా. మొదటి మ్యాచ్లో 58 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది టీమిండియా. కానీ ఆ తర్వాత రెండో మ్యాచ్లో మాత్రం టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకున్న టీమిండియా జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఎంతో హోరాహోరీగా జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంతో 2-1 తేడాతో ఆధిక్యంలో కి వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో  సూర్య కుమార్ యాదవ్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. 76 పరుగులు చేశాడు.  ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇక సూర్యకుమార్ యాదవ్ 76 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించడం పై స్పందించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్య ప్రశంసలు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక అసాధారణమైన ప్లేయర్.. అతడు షాట్లు కొడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. వెస్టిండీస్ మూడో టి20 గెలవడంలో అతడి ఇన్నింగ్స్ ఎంతో కీలకమైనది.. ఆలస్యంగా అతడు అవకాశాలు అందుకున్నప్పటికీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో   ముందుంటాడు అంటూ హార్థిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: