ప్రస్తుతం టీమిండియా లో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కోట్ల మంది అభిమానులు రోహిత్ శర్మను తమ ఆరాధ్య క్రికెటర్గా ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన జీవితంలో ఒక్కసారి చూసిన పర్వాలేదు అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఎక్కడైన ఉన్నాడు అని భావిస్తే చాలు అక్కడ తండోపతండాలుగా తరలి వెళ్లి రోహిత్ శర్మను చూడటానికి నిరీక్షణ అభిమానులు ఎదురు చూడటం ఇప్పటి వరకు చూశాము అని చెప్పాలి.


 అది సాధారణంగా క్రికెటర్లకు అభిమానులు ఉండటం సహజమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి అభిమానుల కారణంగానే క్రికెటర్లకు ఇబ్బందులు ఎదురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎక్కడికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాగా ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.


 మరికొన్ని రోజులు జరగబోయే ఆసియా కప్ కు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు అని చెప్పాలి. హోంటౌన్ ముంబైలో ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉన్నాడు. అయితే ఇటీవల ముంబైలోని ఒక హోటల్ కి వెళ్ళిన రోహిత్ శర్మ కు అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. రోహిత్ శర్మ హోటల్ కి వచ్చాడు అని తెలుసుకున్న ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు  దీంతో రోహిత్ శర్మ బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన హోటల్ ముందు అభిమానులను చూసి వామ్మో ఏంది ఇంత జనం అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు రోహిత్ శర్మ.  ఇక బయటికి వెళ్లే బదులు చివరికి లోపలికి వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: