ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న భారత మహిళల జట్టు అక్కడ ఇటీవల జరిగిన టీ-20 సిరీస్లో పేలవ ప్రదర్శన తో నిరాశ పరిచింది. చివరికి సిరీస్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో అభిమానులు నిరాశ లో మునిగి పోయారు. కానీ అటు వెంటనే ప్రారంభమైన వన్డే సిరీస్లో మాత్రం టీమిండియా సత్తా చాటింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లో భాగంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానులందరిలో ఉత్సాహాన్ని నింపింది టీమిండియా మహిళల జట్టు.


 ఇక రెండో మ్యాచ్ లో అయితే టీమిండియా అద్భుతమే చేసి చూపించింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు శతకం తో టీమిండియాకు భారీ స్కోరు అందించింది. 143 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇందులో 18 ఫోర్లు 4 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఆ తర్వాత మరికొంతమంది బ్యాటర్లు కూడా బాగా రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోరు చేసింది అని చెప్పాలి.  ఇంగ్లాండ్ పై ఇప్పటివరకు టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.


 ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టు 44.2 ఓవర్లలోనే 246 పరుగులు చేసి ఆలౌటైంది. తద్వారా భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఇలా సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మహిళల జట్టు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇంగ్లండ్ గడ్డపై దాదాపు 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టీమిండియా పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: