సాధారణంగా క్రికెట్లో కొంతమంది ఆటకాళ్ల మధ్య పోటీ ఎప్పుడు గమ్మత్తుగా ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక వారు ఎన్నిసార్లు పోటీపడినా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరిక ప్రేక్షకులలో కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అలాంటి పోటీ ఒకప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్- బ్రెట్ లీ మధ్య ఉండేది అని చెప్పాలి. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట మాస్టర్ బ్లాస్టర్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో ఇక ప్రత్యర్థి బౌలర్లు సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ వేయాలంటేనే భయపడిపోయారు.


 ఇలాంటి సమయంలోనే అటు సచిన్ - బ్రెట్ లీ మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగేది. ఇక ఒకవైపు బ్రెట్ లీ బౌలింగ్ చేస్తూ ఉంటే మరో వైపు సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఇక ఈ రసవత్తరమైన పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తి చూపేవారు అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా క్రికెట్లో దిగజ బౌలర్గా కొనసాగుతున్న బ్రేట్ లీ -సచిన్ టెండూల్కర్ పోటీ ఇప్పటికీ కూడా ప్రేక్షకుల ఫేవరెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతని బౌలింగ్లో సచిన్ కొట్టే స్క్వేర్ లెగ్ కవర్ డ్రైవ్ షాట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.


 కాగా సచిన్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఆటను చూడలేకపోయారు ప్రేక్షకులు. కానీ ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా చివరికి అభిమానులకు సచిన్ టెండూల్కర్ ఆట చూసే అవకాశం వచ్చింది.  అంతేకాదు ఒకప్పుడు ప్రేక్షకులను ఆకర్షించిన సచిన్ టెండూల్కర్ బ్రేట్ లీ పోరును మరోసారి చూసేందుకు అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా లెజెండ్స్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సచిన్ బ్రెట్ లీ బౌలింగ్లో తొలి బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఆణిముత్యం లాంటి బౌండరీ కొట్టాడు సచిన్. ఇక ఇది చూసిన అభిమానులు అప్పటికి ఇప్పటికీ సచిన్ ఏమీ మారలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: