చివరిగా 2007లో ధోని కెప్టెన్సీలో టి20 ఫార్మాట్ లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది భారత జట్టు. అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది కూడా భారీ అంచనాల మధ్య బరి లోకి దిగటం.. చివరికి ఏదో ఒక దశ లో పేలవ  ప్రదర్శన తో నిరాశ పరిచి ఇంటి బాట పట్టడం లాంటివి చేస్తూ ఉంది.  ధోని తర్వాత కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ  చేపట్టాడు. కోహ్లీ కెప్టెన్సీ లో వరల్డ్ కప్ రాలేదు. ఇక ఇప్పుడు రోహిత్ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతనిపై భారత ప్రేక్షకులందరిలో కూడా భారీగానే నమ్మకం ఉంది.


 ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అటు టీమిండియా కు అందరి ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ని కూడా గెలిపిస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ సారధ్యంలో మొదటి సారి టీమిండియా వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమైంది. ఇలాంటి సమయం లో టీమిండియాకు ఎదురు దెబ్బలు వరుసగా తగులు తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జడేజా దూరమయ్యాడు. ఆ తర్వాత బుమ్రా గాయం బారిన పడి కొన్నాళ్లు పాటు దూరంగా ఉండి మళ్ళీ జట్టు లోకి వచ్చాడు.

 జడేజా లేకపోయిన బుమ్రా ఉన్నాడు అనే ధైర్యం అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు బుమ్రా కూడా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఈ క్రమంలోని బుమ్రా స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.. అయితే బుమ్రా స్థానంలో బీసీసీఐ మహమ్మద్ సిరాజ్ను రీప్లేస్ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తెలిపింది. ఇక మరోవైపు అనుభవం ఉన్న మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని కొంతమంది అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: