ఇటీవల న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ముక్కోనపు సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు ఉండడం గమనార్హం. అయితే టీ20 లలో 29వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా పొట్టి ఫార్మాట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు జాబితాలో 28 హాఫ్ సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 33 హాఫ్ సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.
ఇలా హాఫ్ సెంచరీలలో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజాం ఇక మూడు ఫార్మర్లలో కూడా 11 పరుగులను అందుకున్నాడు అని చెప్పాలీ. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 261 ఇన్నింగ్స్ లో 11 వేల పరుగులు అత్యంత వేగంగా అందుకున్న ఆసియా బ్యాట్స్మెన్ గా రికార్డ్ సృష్టించాడు కోహ్లీ. అయితే ఇప్పుడు బాబర్ అజాం 251 ఇన్నింగ్స్ లోనే ఆ మార్క్ అందుకుని కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు టెస్టుల్లో 3112, వన్డేలలో 4664, టీ20 లలో 3216 పరుగులు చేశాడు బాబర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి