ఇక మొన్నటి వరకు విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా కెప్టెన్గా వ్యవహరించగా.. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుంటే ఇక విరాట్ కోహ్లీ ఒక సాదాసీదా ఆటగాడిగానే ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఒక్కసారి బ్యాటింగ్ కి దిగారు అంటే చాలు వీరు సృష్టించే విధ్వంసంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా మైదానంలో బౌలర్లతో చెడుగుడు ఆడుతూ సొగసైన షాట్లు ఆడుతూ ఉంటే ప్రేక్షకులు అందరూ కూడా మంత్రముగ్దులు అయిపోతూ ఉంటారు అని చెప్పాలి అయితే ఇప్పటికే వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. ఇప్పుడు ఇద్దరూ జోడిగా మరో రికార్డును సాధించారు.
ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ వీరిద్దరి కాంబినేషన్లో అన్ని ఫార్మాట్ లలో కలిపి 7024 పరుగులు పూర్తయ్యాయి అని చెప్పాలి. దీంతో టీమ్ ఇండియా తరపున అత్యధిక భాగస్వామ్యం స్కోర్ చేసిన ఐదవ జంటగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడి నిలిచింది. అంతకుముందు సచిన్ టెండూల్కర్- సౌరబ్ గంగూలీ 12400 పరుగులతో టాప్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రవిడ్ 11,037 పరుగులు, ఇక రాహుల్ ద్రావిడ్- గంగూలీ 7,626 పరుగులతో.. రోహిత్, కోహ్లీ జోడి కంటే ముందు ఉన్నారు అని చెప్పాలి. ఇక వీరి జోడి నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి