ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో బాబర్ అజాం కూడా ఒకరు అని అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అటు స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూనే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు. గతంలో ద్వైపాక్షిక సిరీస్లలో పాకిస్తాన్ కు ఎన్నో అద్వితీయమైన విజయాలు కూడా అందించాడు. అలాంటి బాబర్ ఇటీవల వరల్డ్ కప్ లో మాత్రం చేతులెత్తేస్తూ ఉన్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా బాబర్ సారథ్యంలో బలిలోకి దిగిన పాకిస్తాన్ మొదట భారత్ చేతిలో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత జింబాబ్వే తో మ్యాచ్లో తప్పక గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేదించలేక చేతులెత్తేసింది.
పసికూన జింబాబ్వే చేతిలో పటిష్టమైన పాకిస్తాన్ ఓడిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు. ఈ క్రమంలోనే బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బాగుంటుంది అంటూ ఎంతో మంది సూచనలు ఇస్తున్నారు. బాబర్ కసిన్ పాకిస్తాన్ మాజీ కీపర్ కమ్రాన్ అక్మాల్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. ఒక సోదరుడుగా చెబుతున్న ఈ వరల్డ్ కప్ తర్వాత బాబర్ కెప్టెన్సీ కి గుడ్ బై చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో 25వేల రన్స్ పూర్తి చేయాలంటే కేవలం ఆటగాడిగా మాత్రమే ఉండాలి. తీవ్రమైన ఒత్తుడి కారణంగా ఆట పేలవంగా మారుతుంది. అందుకే కోహ్లీల కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్ పై దృష్టిపెట్టాలి. ఒకవేళ బాబర్ కెప్టెన్గా కొనసాగితే మాత్రం పాకిస్తాన్ క్రికెట్కు తీరని నష్టం జరుగుతుంది అంటూ కామ్రాన్ అక్మాల్ వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి