అదే సమయంలో కొంతమంది ఆటగాళ్ల విషయంలో మాత్రం సెలెక్టరులు ఏకంగా వివక్షపూరితమైన ధోరణితో వ్యవహరిస్తున్నారు అన్నది కొంత కొంతకాల నుంచి వెలుగులోకి వస్తున్న మాట. ముఖ్యంగా వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంజు శాంసన్ విషయంలో సెలెక్టరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అన్నది అర్థం కావడం లేదని అభిమానులు ఇప్పటికే ఆందోళనలో మునిగిపోతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేశాడు. ఇక టీమ్ ఇండియా తరఫున ఆడిన అడపా దడప మ్యాచ్ లలో కూడా ఆకట్టుకున్నాడు.
అయినప్పటికీ టీమ్ ఇండియా సెలెక్టర్లు మాత్రం అతనికి తుది జట్టులో అవకాశం కల్పించడం లేదు అని చెప్పాలి. అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ కొట్టేశాడు సంజు శాంసన్. ఛాన్స్ అయితే దక్కించుకున్నాడు కానీ తుది జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. కనీసం మూడవ టి20 మ్యాచ్ లో అయినా సంజు శాంసన్ తుది జట్టులో కనిపిస్తాడని అభిమానులు ఎదురుచూసారు. కానీ అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది అని చెప్పాలి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు సంజూ ను ఎందుకు తొక్కేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి