2023 ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రయాణం ఇక ఇటీవల లక్నో చేతుల్లో ఓడిపోవడం ద్వారా ముగిసినట్లే అయింది. ఎందుకంటే లక్ష్మ జట్టు చేతిలో ఓడిపోవడం కారణంగా ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఇటీవల లక్నో చేతిలో బ్యాటింగ్ పరంగా మంచి ప్రదర్శన చేసినప్పటికీ బౌలింగ్ పరంగా సన్రైజర్స్ చేతులెత్తేసింది. అయితే సన్రైజర్స్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఆడిన మ్యాచ్లు చూసుకుంటే.. 180 కి పైగా పరుగులు చేసిన ప్రతిసారి కూడా విజయం సన్రైజర్స్ వైపే ఉంది.



 ఇలా 180 కి పైగా పరుగులు చేసిన మ్యాచ్ లలో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విన్నింగ్ పర్సంటేజ్ 80% ఉంది అని చెప్పాలి. అలాంటి సన్రైజర్స్ ఇక నిన్న లక్నోతో మ్యాచ్లో గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పేలవ బౌలింగ్తో 180 పరుగుల స్కోర్ ను కాపాడుకోలేక సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో చివరికి ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అనంతరం తమ ఓటమి పై స్పందించిన జట్టు కెప్టెన్ మార్కరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడం మా ఓటమికి కారణమైంది అంటూ చెప్పుకొచ్చాడు.



 మేం చేసిన 180 పరుగుల స్కోర్ విజయానికి సరిపోతుందని అనుకున్నాను. మేం అద్భుతంగానే బ్యాటింగ్ చేశాము. కానీ ఒక్క భాగస్వామ్యం దొరికి ఉంటే సునాయాసంగా 200 పరుగు మార్క్ అందుకునేవాళ్ళం. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్ది వికెట్ ఎంతో నెమ్మదించింది. అందుకు అనుగుణంగా బౌలింగ్లో మేము మంచి ఆరంభాన్ని అందుకున్నాం. అభిషేక్ శర్మ ఓవర్ మ్యాచ్ ము మలుపు తిప్పింది. ఇక చివరి మూడు మ్యాచ్లలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం అంటూ మార్కరమ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో లక్నో ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl