టీమ్ ఇండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే ఇక బిసిసిఐ సెలెక్టర్లు ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఆడబోయే టి20 సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ ని కూడా విడుదల చేశారు. అదే సమయంలో ఇక వెస్టిండీస్తో టి20 సీరియస్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించారు అని చెప్పాలి. అయితే అందరూ ఊహించినట్లుగానే మరోసారి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించి ఇక ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ కి కూడా ఈ పర్యటనలో ఛాన్స్ ఇచ్చారు సెలెక్టర్లు.


 ఈ క్రమంలోనే గత కొన్ని సీజన్స్ నుంచి నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకి కూడా భారత జట్టులో చోటు దక్కింది. దీంతో అతని ఫాన్స్ అందరు సంతోషంగా మునిగిపోయారు. ఈ ఏడాది తన ఇన్నింగ్స్ లతో సంచలనం సృష్టించిన యశస్వి జైస్వాల్ కూడా టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి సంజు శాంసన్ విషయంలో సెలెక్టర్లు వివక్ష చూపుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శన చేసిన సంజూను ఇక వెస్టిండీస్ పర్యటన కోసం  జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది అని అందరూ అనుకున్నారు.


 ఇక అందరూ అనుకున్నట్లుగానే వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో సంజు శాంసన్ కు చోటు దక్కింది అని చెప్పాలి. దీంతో అతని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి .ఎందుకంటే సంజూ శాంసన్ కి ఎప్పుడెప్పుడు టీమిండియాలో చోటు దక్కుతుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అతనికి అవకాశం రావడంతో అభిమానులు మురిసిపోతుండగా.. ఇక సెలక్టర్లు తమపై వచ్చిన విమర్శలను తగ్గించుకునే క్రమంలోనే సంజూకీ అవకాశం ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: