భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న చటేశ్వర పూజార గత కొంతకాలం నుంచి అడపా దడప అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్నాడు. అయితే ఇంగ్లాండ్ కౌంటిలలో మంచి ప్రదర్శన చేయడం కారణంగా.. ఇక కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో.. సెలెక్టర్లు మళ్ళీ అతనికి భారత జట్టులో అవకాశం కల్పించారు. కీలకమైన డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపిక చేశారు. అయితే ఇక జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాల్సిన పూజారా తడబడ్డాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక జట్టుకు భారంగానే మారిపోయాడు.  దీంతో యువ ఆటగాళ్లను కాదని సీనియర్ అయిన పూజారను ఎంపిక చేయడం పై విమర్శలు కూడా వచ్చాయి.


 అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వైఫల్యం కారణంగా పూజరాకు ఇక వెస్టిండీస్ పర్యటనలో ఆడబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. ఇక అతనిపై వేటు వేయడం గురించి అందరూ చర్చించుకున్నారు. అయితే ఇటీవల వేటుపడిన పూజార అటు దేశవాళి క్రికెట్లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ప్రస్తుతం దిలీప్ ట్రోఫీలో సెమీఫైనల్ పోరు లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన పూజార.. 278 బంతుల్లో 133 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఇందులో 14 ఫోర్లు ఒక సిక్సర్  ఉండడం గమనార్కం. అతని సహచరులంతా అటు పెవిలియన్ క్యూ కడుతున్న సమయంలో తనకు అలవాటైన శైలిలో మరోసారి బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు పూజారా.


 ఏకంగా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను ఇబ్బంది పెట్టాడు అని చెప్పాలి. సెంట్రల్ జోన్తో జరుగుతున్న పోరులో ఓవర్ నైట్ స్కోర్ 149/3 తో మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 292/9 తో నిలిచింది. చివరి బంతికీ పూజార రన్ అవుట్ రూపంలో ఓపెన్ తిరిగాడు అని చెప్పాలి. కదాకాగా ఇదే మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ (52) పరుగులు చేసి హాఫ్ సెంచరీతో మెరిసాడు. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం 6 పరుగులు చేసి విఫలమయ్యాడు. కాగా గతంలో ఇంగ్లాండ్ కౌంటి లలో ఇలాగే రానించి జట్టులోకి వచ్చాడు. కానీ భారత జట్టు తరఫున ఆకట్టుకోలేకపోయాడు. మరి ఇప్పుడు దేశ వాలి క్రికెట్లో రాణిస్తున్న పూజారకు మళ్ళీ సెలెక్టర్లు అవకాశం ఇస్తారు లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: