ఈ క్రమంలోనే 12 పాయింట్లు ద్వారా ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది అని చెప్పాలి. 100% విజయాలతో వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసింది. కాగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ తో తలబడుతున్న ఆస్ట్రేలియా 61.1% విజయాలతో రెండో ప్లేస్ ని దక్కించుకుంది అని చెప్పాలి. మూడో టెస్టులో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్.. ఇక మూడో స్థానాన్ని దక్కించుకుంది అని చెప్పాలి. ఆప్కానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ నాలుగో ప్లేస్ లో ఉంది. ఇక ఇదే లిస్టులో న్యూజిలాండ్ ఐదవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.
అయితే టీమిండియా అగ్రస్థానానికి చేరుకోవడం సంతోషంగానే ఉన్నప్పటికీ.. ఇక అటు ఫ్యాన్స్ మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా సాధారణ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఇండియా. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రెండవ సీజన్ లో ఫైనల్ వరకు చేరుకున్న ఇండియా ఇక ఫైనల్ పోరులో గెలవలేక చివరికి రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయిన ఇండియా.. ఇక ఈ ఏడాది జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి