ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే    తాను చరిత్రలో నిలిచిపోయే క్రికెటర్ను అన్న విషయాన్ని నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఎంతోమంది లెజెండరి ప్లేయర్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు. అయితే నేతి తరం క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ కి సమఉజ్జీలు కూడా ఉన్నారు. కానీ రికార్డుల విషయంలో మాత్రం కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు అని చెప్పాలి.


 అయితే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మర్లలో కలిపి 76 సెంచరీలు చేశాడు అంటే ఇక అతని ఆటతీరు ఎంత అద్భుతంగా సాధిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా భారత జట్టుకు ఇప్పటికే ఎంతో సేవ చేసిన కోహ్లీ అటు ప్రతి మ్యాచ్లో కూడా కొత్తగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడిలాగా ఎంతో కసితో కనిపిస్తూ ఉంటాడు. ఎన్ని పరుగులు చేసిన దాహం తీరలేదు అన్నట్లుగానే అతని ఆట తీరు కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. దీంతో తన 500వ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి అరుదైన రికార్డు సృష్టించాడు.


 కాగా ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ.. తన రికార్డుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సాధించిన రికార్డులు, గణాంకాలు, మైలురాళ్లు తాను పట్టించుకోనని.. ఇవి తనపై ప్రభావం చూపబోవు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వెండిస్ రెండో టెస్టులు సెంచరీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. నేను 50 చేసే అవుట్ అయితే సెంచరీ మిస్ అవుతాను. ఒకవేళ 120 చేసి వికెట్ కోల్పోతే డబుల్ సెంచరీ కోల్పోతాను. కాబట్టి ఇలాంటివి నాపై ప్రభావం చూపలేవు. జట్టుకు ఉపయోగపడే విధంగా ఆడటం గెలిపించడమే నా లక్ష్యం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: