
ఈ క్రమంలోనే అటు రవీంద్ర జడేజా ఫీల్డింగ్లో చేసే విన్యాసాలు ప్రేక్షకులందరికీ కూడా అబురు పరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక జడేజా లాంటి ఆల్ రౌండర్ తమకు కూడా ఉంటే ఎంత బాగుండు అని ప్రత్యర్థి టీమ్స్ కోరుకునే విధంగా అతని ఆట తీరు కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తూ ఉండగా.. మూడు ఫార్మట్లలో కూడా భాగం అయ్యాడు జడేజా. ఈ క్రమంలోనే ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో మంచి ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా ఇప్పుడు వన్డే ఫార్మట్లో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా వెస్టిండీస్, టీమ్ ఇండియా మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు మొదటి మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఈ మొదటి మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. నేడు జరగబోయే మొదటి వన్డే మ్యాచ్లో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీస్తే కరేబియన్లపై అత్యధిక వికెట్లు తీసిన భారత దిగ్గజం కపిల్ దేవ్ (43) రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు. ప్రస్తుతం అనిల్ కుంబ్లే తో సమానంగా రవీంద్ర జడేజా 41 వికెట్లతో ఉన్నాడు అని చెప్పాలి. రవీంద్ర జడేజా జోరు చూస్తే ఈ రికార్డు సాధించేలా కనిపిస్తూ ఉన్నాడు.