ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు అక్కడ వరుస సిరీస్ లు ఆడుతూ బిజీ బిజీ గా గడుపుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ లను ముగించింది. ఇక ఈ రెండు ఫార్మట్ లలో కూడా సిరీస్ లు గెలుచుకుని సొంత గడ్డపైనే వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో  టి20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది టీం ఇండియా.


 అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా గెలిచిన జోరులో ఉన్న టీమిండియా అటు టి20 ఫార్మట్ లో కూడా ఎంతో అలవోకగా సిరీస్ లో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లోనే టీమ్ ఇండియాకు పరాభవం ఎదురయింది అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయింది  అయితే వెస్టిండీస్ భారత జట్టు ముందు 150 పరుగుల నామమాత్రపు స్కోరు ఉంచినప్పటికీ భారత బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేదు.


 అయితే ఎప్పుడూ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకునే తిలక్ వర్మ మాత్రం మరోసారి తన సత్తా చాటాడు. 22 బంతుల్లో 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ గురించి ఇక టీమిండియా కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న తప్పులు చేయడం వల్లే ఓటమిపాలు అయ్యాము అంటూ చెప్పిన  పాండ్యా యంగ్ ప్లేయర్స్ తో నిండిన జట్టులో ఇలాంటి చిన్న తప్పులు సహజం అంటూ చెప్పుకొచ్చాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్ తనను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. అతనిలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాస్తయినా భయం కనిపించలేదు అంటూ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: