ఈ క్రమంలోనే ఈ ఆసియా కప్ పై కూడా అటు ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉన్నప్పటికీ భారత జట్టు అటు పాకిస్తాన్ వెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో ఇక భారత్ ఆడే మ్యాచ్ల కోసం పాకిస్తాన్ కాకుండా తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. దీంతో ఇక పాకిస్తాన్ తో పాటు శ్రీలంక వేదికగా ఆసియా కప్ మ్యాచ్లు జరగబోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు మ్యాచ్ ను మరింత ఉత్కంఠ భరితంగా మార్చేందుకు వ్యాఖ్యతలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఆసియా కప్ కోసం వ్యాఖ్యాతలుగా ఎవరు వ్యవహరించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ మెగా టోర్నికి వ్యాఖ్యాతలుగా ఎవరుంటారు అనే విషయంపై ఒక లిస్ట్ రెడీ అయింది అనేది తెలుస్తుంది. వీరిలో గౌతమ్ గంభీర్, రవి శాస్త్రి, మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, దీప్దాస్ గుప్తా, రమీజ్ రాజా, అధర్, రసూల్ ఆర్నాల్డ్, స్కాట్ స్టైరిష్, బజిద్ ఖాన్ లు వ్యాఖ్యాతలుగా తమ గాత్రంతో ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నారట. కాగా భారత జట్టు తమ తొలి మ్యాచ్ ను అటు సెప్టెంబర్ రెండవ తేదీన పాకిస్తాన్తో ఆడబోతుంది. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ వేదికగా కాకుండా శ్రీలంక వేదికగా జరగబోతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి