టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నిలో ఒక వైపు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడంతోపాటు మరో వైపు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు మాజీ ఆటగాళ్ళు. అయితే కెప్టెన్గా తన వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తున్న రోహిత్ శర్మ.. ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయంలో ఓపెనర్ గా బరిలోకి దిగుతూఎంతో దూకుడుగా ఆడుతున్నాడు.


 ఈ క్రమంలోనే ఇక టీమిండియా కు మంచి ఆరంభాలు అందిస్తూ ఉండడంతో ఇక రోహిత్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎంతో స్వేచ్ఛగా ఆడుతూ భారీగా స్కోర్ చేయగలుగుతున్నారు అని చెప్పాలి. క్రీజులో ఉండేది అతి తక్కువ సమయమే అయినా  ఉన్నంత సేపు మాత్రం తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టిస్తూ ప్రత్యర్థులను వనికిస్తున్నాడు అని చెప్పాలి.  కెప్టెన్ గా టీమిండియా కు వరుస విషయాలు అందించి జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ ఫామ్ గురించి ఇంగ్లాండు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.


 టీమిండియా విజయాలతో దూసుకెళ్తూ ఉండడంపై కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో రోహిత్ రియల్ హీరో. అతడు జట్టును నడిపిస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంది. దూకుడు బ్యాటింగ్తో జట్టుకు మెరుపు ఆరంభాలను ఇస్తున్నాడు. ఈసారి అతడు రికార్డుల కోసం చూసుకొని ఉంటే కనీసం ఐదు సెంచరీలు అయినా చేసేవాడు. కానీ తన ఆట తీరుతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు రోహిత్ శర్మ అంటూ ప్రశంసలు కురిపించాడు నాజీర్  హుస్సేన్. కాగా ఓపెనర్ గా బరిలోకి దిగుతూ సిక్సర్లు ఫోర్ లతో రోహిత్ శర్మ చెలరేగిపోతూ   ఉండడంతో ఇక ఆ మిగతా బ్యాట్స్మెన్లందరికీ కూడా ఒత్తిడి లేకుండా నిలకడగా ఆడేందుకు అవకాశం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc