ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భారత జట్టుకు నిరాశ ఎదురయింది. వరుసగా విజయాలు సాధిస్తూ టైటిల్ గెలుస్తుంది అని అందరిలో నమ్మకాన్ని కలిగించిన టీమిండియా.. ఇక అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరలేక పోయింది. ఏకంగా సెమీఫైనల్ తో కలుపుకొని 10 మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించిన భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది. దీంతో ఇక అప్పటికి ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా సొంత గడ్డపై.. టీం ఇండియాని ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది అని చెప్పాలి.


 ఏకంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానంలో.. ఇప్పటివరకు టీమిండియా ఆటగాళ్ళు ఎన్నోసార్లు మ్యాచ్లు ఆడారు. కానీ కొత్త పిచ్ పై మ్యాచులు ఆడుతున్నట్లు భారత బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి తెగ కష్టపడి పోయారు అని చెప్పాలి. నాణ్యమైన పిచ్ లేకపోవడంతోనే ఇక అటు భారత జట్టు ఓడిపోయిందంటూ కొంతమంది సరికొత్త విమర్శలకు కూడా తెరలేపుతున్నారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో ఫైనల్ లో టీమిండియా ఓటమి గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు.. ప్రముఖ వ్యక్తులు చేస్తున్న కామెంట్లు చర్చనీయాంశంగా మారగా.. ఇక ఇప్పుడు మమతా బెనర్జి చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారిపోయాయి. మ్యాచ్ వేదిక మార్చి ఉంటే గెలిచే వాళ్ళం అంటూ ఇప్పటికే ఎంతోమంది స్టేట్మెంట్స్  ఇవ్వగా.. మమత బెనర్జీ  కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లేదంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచేదని కామెంట్ చేశారు మమతా బెనర్జీ. ఇక ఆమె చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. అయితే పిచ్ తో సంబంధం ఏముంది.. అత్యుత్తమ ఆట కనబరిస్తే ఎక్కడైనా విజయం సాధించగలం అని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: