ఇటీవలే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీం ఇండియా. సొంతగడ్డ మీద జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ కావడంతో 2011 లాగానే టైటిల్ అందుకొని విశ్వవిజేతగా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. ఇక అందరి అంచనాలకు తగ్గట్లు గానే టీమిండియా ప్రస్థానం కూడా కొనసాగింది అని చెప్పాలి. వరుస మ్యాచ్లలో విజయం సాధిస్తూ దూసుకుపోయింది టీమిండియా. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబాటుకు గురైంది.


 ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి చివరికి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలనే కలను నెరవేర్చుకోలేకపోయింది టీమిండియా. అయితే ఫైనల్ మ్యాచ్లో ఓటమితో భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఏకంగా టీమిండియా ప్లేయర్స్ కూడా అటు కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఇంకా ఈ బాధ నుంచి అటు క్రికెట్ ప్రేక్షకులు మాత్రం బయటపడలేకపోతున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఒకటి మినహా లీగ్ మొత్తం మంచి ప్రదర్శన చేసిన భారత జట్టు టోర్నీలో విజయవంతమైన టీం గా నిలిచింది.


 అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందించాడు. జట్టులోని అందరి సభ్యులు లాగానే తాను కూడా వరల్డ్ కప్ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ పరాజయం తనను వెంటాడింది అంటూ తెలిపాడు. దాదాపు 7 నుంచి పది రోజులపాటు నిద్రలో కూడా వరల్డ్ కప్ ఓటమి గుర్తొచ్చిందని.. ఇక ఆ తర్వాత జీవితం మారుతుందని ముందుకు సాగుతుందని నాకు నేను సర్ది  చెప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ అటు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇటీవల టి20లలో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక మూడో టి20 మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: