టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇటీవలే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. అయితే భారత క్రికెట్ లో ఉన్న లెజెండ్స్ లో ధోని కూడా ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆటగాడిగా మాత్రమే కాదు సారధిగా కూడా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాడు అని చెప్పాలి. అయితే అప్పటివరకు ఎంతమంది కెప్టెన్లు మారినప్పటికీ.. టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయింది. ఇలాంటి సమయంలోనే ధోని కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమ్ ఇండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించాడు.


 ఇక అన్ని ఫార్మాట్ లో కూడా భారత జట్టుకు ఐసిసి ట్రోఫీలు అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనికే దక్కుతుంది. ఇక ఇప్పటివరకు పలువురు కెప్టెన్లు మారిన ధోని రికార్డును మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. అయితే ధోని చేసిన సేవలకు గాను ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చిన బీసీసీఐ ధోని జెర్సీ నెంబర్ సెవెన్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే గతంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10కి కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించింది బీసీసీఐ. జెర్సీ నెంబర్ రిటైర్మెంట్ పై కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూషన్ లో పడిపోయారు. ఆటగాళ్ల రిటైర్మెంట్ చూశాం. కానీ జెర్సీ రిటైర్మెంట్ ఏంటి అని తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.



 ఇంతకీ జెర్సీ నెంబర్ రిటైర్మెంట్ ఏమిటి అంటే ఒకసారి ఇక బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత భారత క్రికెట్లో ఏ ఆటగాడు కూడా ఈ నెంబర్తో జెర్సీ ధరించేందుకు వీలు ఉండదు. దిగ్గజ ఆటగాళ్లు చేసిన సేవలను గౌరవిస్తూ వారు ధరించిన జెర్సీ నెంబర్లను మరొకరు వినియోగించకుండా రిటైర్ చేయడం క్రీడల్లో ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం జెర్సీ నెంబర్ల కేటాయింపులో ప్రత్యేకంగా  నిబంధనలు ఏమీ లేవు. ఒకటి నుంచి 100 వరకు ఆటగాళ్లు ఏ జెర్సీ నెంబర్ను అయినా సరే ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: