ఇటీవల కాలంలో భారత క్రికెట్లో నయా ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న రింకు సింగ్ పేరు తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ లో మెరుపు ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన ఈ యువ క్రికెటర్.. ఇక టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. భారత జట్టు తరుపున కూడా ఆదే రీతిలో ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. మొన్నటి వరకు టి20లలో మెరుపులు మెరూపించిన  రింకు సింగ్.. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడుతున్న వన్డే  సిరీస్ లో వన్డే   ఫార్మట్ లో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు.


 ఇక ఇటీవలే జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఇక వన్డేలోకి అరంగేట్రం చేసిన ఈ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ మొదటి మ్యాచ్ లో మాత్రం పెద్దగా పరుగులు చేయలేదు. పద్నాలుగు బంతుల్లో 17 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఇందులో రెండు ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గమనార్హం. అయితే కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్లో కూడా సత్తా చాటాడు రింకు. ఏకంగా వికెట్ తీశాడు. రింకు సింగ్ ఏంటి బౌలింగ్ చేయడం ఏంటి అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు కదా.. కానీ నిజంగానే ఇటీవల తన బౌలింగ్ తో అదరగొట్టాడు ఈ నయా ఫినిషర్.


 మంచి భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ స్కోరు బోర్డుని  ముందుకు నడిపిస్తున్న వాండర్ డాసేన్ ను రింకు సింగ్ తెలివిగా బోల్తా కొట్టించాడు. రింకు వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డాసేన్ వికెట్ కీపర్ సంజుకి క్యాచ్ ఇచ్చాడు. ఇక వికెట్ తీసిన అనంతరం ఎంతో గ్రాండ్ గా సంబరాలు చేసుకున్నాడు రింకు. ఇక సహచర ఆటగాళ్లు కూడా రింకు వికెట్ తీయడంతో ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో రింకు సింగ్ కి ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఇలా రింకు బౌలింగ్ చేయడం చూసి బ్యాటింగ్లో మెరుపులు మాత్రమే కాదు రింకు సింగ్ లో  ఇలాంటి బౌలింగ్ ప్రతిభ కూడా ఉందా అని అభిమానులు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir