టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఎంతోమంది లెజెండ్స్ ఉన్నారు. ఇలాంటి వారిలో చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వారు ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇక గతంలో టీమిండియా తరఫున డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్. తన ధనా ధన్ ఇన్నింగ్స్ తో  ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా తన మెరుపు ఇన్నింగ్స్ లతో అప్పట్లో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇలా తన ఆట తీరుతో ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగాడు కాబట్టే ఇప్పటికీ కూడా భారత క్రికెట్లో అతనికి ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పాలి. అయితే ఇలా ఒకప్పుడు తన ఆట తీరుతో అలరించిన వీరేంద్ర సెహ్వాగ్.  ఇక ఇప్పుడు బ్యాట్ పట్టుకొని మళ్లీ మైదానం లోకి దిగేందుకు సిద్ధమయ్యాడు  ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో అరంగేట్రం సీజన్లో బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. ముంబై చాంపియన్స్ జట్టుతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.


 అయితే కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా అటు జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించబోతున్నాడు అని చెప్పాలి. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగమైనందుకు ఎంతగానో ఆనందంగా ఉన్నాను. నేను ముంబై చాంపియన్స్ తరఫున బలిలోకి దిగబోతున్నాను. ఇక నా అభిమానులు అందరూ కూడా ముంబై చాంపియన్స్ కు మద్దతుగా ఉండండి. డెహ్రాడూన్ లో కలుద్దాం అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 3 వరకు డెహ్రాడూన్ వేదికగా ఐపిఎల్ తరహాలోనే ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది.  క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా లాంటి దిగజాలు ఈ లీగ్ లో భాగం కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: