మరికొన్ని రోజులు ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఐపీఎల్ హడావిడి కనిపిస్తుంది. అయితే ఇక ఏడాది పది టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగెందుకు సిద్ధమయ్యారు. మార్చి 22వ తేదీ నుంచి కూడా ఈ క్రికెట్ పండుగ మొదలు కాబోతుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెట్లు తలబడబోతున్నాయి. అయితే గత కొంతకాలం నుంచి టైటిల్ పోరిలో కాస్త వెనకబడిపోయిన ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది.


 ఏకంగా జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాను గుజరాత్ జట్టు నుంచి తీసుకొచ్చి మరీ అతని చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టింది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అటు ముంబై ఇండియన్స్ జట్టు ఎలా రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఏకంగా ఈ ఐపీఎల్ లో 10 టీమ్స్ బరిలోకి దిగుతూ ఉండగా.. అందరి కన్ను కూడా అటు ముంబై ఇండియన్స్ ప్రదర్శన పైనే ఉండబోతుంది అని చెప్పాలి. దీంతో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ముంబై ఇండియన్స్ సిద్ధమవుతూ ఉండగా ఆ జట్టుకు మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి.


 జట్టు విజయాలలో కీలకంగా వ్యవహరిస్తారు అనుకున్న ఆటగాళ్లు గాయం మారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరో ప్లేయర్ ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ముంబై బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం బారిన పడ్డాడు. అతని గాయం పై ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన కూడా చేసింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో అతను లంక జట్టుకు దూరమయ్యాడు. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ కొత్త సీసన్ ప్రారంభం కానుండగా.. ముంబై ఆడబోయే ప్రారంభ మ్యాచ్ లకి కూడా అతను దూరంగా ఉంటాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl