ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్ లలో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియాకు అటు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది గత కొంతకాలం నుంచి కేవలం కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ప్రపంచ కప్ టోర్నీలో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే టీమిండియా  జట్టు ఇక మొదట్లో వరుస మ్యాచ్ లు గెలుస్తూ బాగా రాణిస్తుంది  కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం తడబడుతూ చివరికి ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించి అందరిని నిరాశ పరుస్తుంది అని చెప్పాలి.



 అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అయితే అటు భారత జట్టు వరల్డ్ కప్ గెలిచినంత పని చేసింది. ఏకంగా మొదటి మ్యాచ్ నుంచి కూడా ఏకంగా సెమీఫైనల్ మ్యాచ్ వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓటమి లేకుండా దూసుకుపోయింది. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తు చేస్తూ అదరగొట్టింది. టీమిండియా జోరు చూస్తే ఫైనల్ లో కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో మాత్రం తడబాటుకు గురైంది టీమిండియా. దీంతో ఇక భారత జట్టు టైటిల్ గెలవలేక రన్నరప్ తో మాత్రమే సరిపెట్టుకుంది. ఇక ఈ ఓటమిని భారత క్రికెట్ ప్రేక్షకులు ఎన్నో రోజులపాటు జీర్ణించుకోలేకపోయారు అని చెప్పాలి.



 అయితే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో  ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం అంటూ టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అన్నాడు. అహ్మదాబాద్ లో ఫైనల్ కి ముందు సాయంత్రం సమయంలో వరుసగా మూడు రోజులు పిచ్ ను పరీక్షించారు. అయితే ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్, స్టార్క్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి స్లో పిచ్ లు కావాలని క్యూరేటర్ కి  సూచించారు. పిచ్ క్యూరేషన్ తో మిగిలిన వాళ్లకు ఏం సంబంధం లేదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు ఫైనల్ జరిగిన మూడు రోజులు  నేను అహ్మదాబాద్ లోనే ఉన్నాను. నెమ్మదిగా ఉన్న పిచ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 240 కి పరిమితమైంది ఇక చేదనలో పిచ్ స్వభావం మారడంతో ఆస్ట్రేలియా అద్భుతంగా రానించింది అంటూ మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: