భారత క్రికెట్ హిస్టరీలో నేటి తరానికి కొంతమంది ఆటగాళ్లు లెజెండరీ ప్లేయర్స్ గా ఎదిగారు అన్న విషయం తెలిసిందే. అలాంటి ప్లేయర్లలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు.  అందరి లాగానే సాదాసీదా స్పిన్నర్ గా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తన ఆట తీరుతో ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో అశ్విన్ కు మించిన స్పిన్నర్ మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక సాంప్రదాయమైన టెస్టు క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్.. కోట్లాదిమంది క్రికెట్ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు అని చెప్పాలి.



 అతని కెరియర్లో మధ్యలో కొన్ని రోజులపాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఇక పట్టుదలతో మళ్ళీ మునుపటి ఫామ్ ను సాధించి టీమ్ ఇండియాలోకి వచ్చాడు. ఇక ఇప్పుడు భారత జట్టు ఏ టీమ్ తో టెస్ట్ సిరీస్ ఆడిన ఇక ఫైనల్ టీంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ కు తప్పక చోటు దక్కుతుంది అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న అటు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అశ్విన్ ఎంత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ స్పిన్నర్.. తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్లేయర్.


 ఒకానొక దశలో క్రికెట్ ను వదిలేద్దామని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గతంలో సరైన అవకాశాలు లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఒకసారి ఇంట్లో నాన్నతో ఏదో గొడవ అయినప్పుడు ఆయన.. నీకు నిజాయితీ ఎక్కువ అందుకే నష్టపోతున్నావు అంటూ తిట్టారు. సాధారణంగా ఎప్పుడు అంత బాధ పడను. కానీ ఆయన అలా అనడంతో ఏడుపును ఆపుకోలేకపోయాను. ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. అలా కొంతకాలం పాటు చీకటి గదిలో కూర్చొని ఎంతో బాధపడుతూ ఉండేవాడిని అంటూ అశ్విన్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: