ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్ తో మునుపటిలా చెలరేగిపోయాడు.ఇక ఈ ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో వైజాగ్ వేదికగా బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఏకంగా 6 బంతుల్లో 6 బౌండరీలు బాది సూపర్ అనిపించాడు.వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్‌లో రిషభ్ పంత్ వరుసగా 4, 6, 6, 4, 4, 4 లతో బాల్స్ బాది ఏకంగా ఒకే ఓవర్ లో 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే రిషబ్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.ఈ ఓవర్ తొలి బంతిని ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదిన పంత్ ఆ తరువాత రెండో బంతిని ఓవర్ వైడ్ లాంగాఫ్‌లో సిక్సర్ కొట్టాడు. మూడో బంతిని ఫ్లిక్ షాట్‌తో ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా పెద్ద సిక్సర్ బాదాడు. ఐదో బంతిని బ్యాక్ వార్డ్ పాయింట్ దిశగా బౌండరీ కొట్టిన పంత్.. ఐదో బంతిని లెగ్ సైడ్ ఇంకా చివరి బంతిని డీప్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా బౌండరీలు బాది 28 పరుగులు చేశాడు.


ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఆక్సిడెంట్ తరువాత రిషభ్ పంత్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంతో గతేడాదిన్నరగా క్రికెట్ ఆటకు దూరమైన పంత్.. ఎట్టకేలకు తన ఫామ్ అందుకున్నాడని, పాత పంత్ తరహాలో చెలరేగుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.అయితే వరుణ్ చక్రవర్తీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రిషభ్ పంత్ భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్‌ అయ్యి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 భారీ స్కోర్ చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.ప్రస్తుత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది.మొత్తానికి పంత్ ఫాంలోకి రావడం ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: