టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ కెరియర్ గత కొంతకాలం నుంచి కూడా సందిగ్ధంలో  పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఘోరమైన రోడ్డు ప్రమాదం బారిన పడిన తర్వాత రిషబ్ పంత్ మళ్లీ కోలుకొని ప్రొఫెషనల్ క్రికెట్ లోకి రాగలడా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చిన మునుపటిలా ఫామ్ అందుకుని మళ్ళీ భారత జట్టులో చోటు దక్కించుకోగలడా లేదా అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పంత్ ఇటీవల కోలుకున్నాడు.


 ఐపీఎల్ లో అడుగు పెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఒకవైపు జట్టును ముందుకు నడిపించడమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతున్నాడు రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అటు రిషబ్ పంత్ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక అతని ఫామ్ చూస్తూ ఉంటే ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకునేలాగే కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయాలా వద్దా అనే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు.


ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్ కు ఇక టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమైనట్లే అని తెలుస్తుంది. ఒకవైపు కీపర్ గా అదరగొట్టడమే కాదు.. ఇంకోవైపు జట్టు విజయం కోసం శాయశక్తుల శ్రమిస్తున్నాడు  ఈ క్రమంలోనే అతని ఫిట్నెస్ ఫామ్ చూసిన తర్వాత టి20 వరల్డ్ కప్ జట్టులోకి పంత్ నీ సెలెక్ట్ చేయాలనే యోజనలో సెలెక్టర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదించింది. భారత జట్టులో పంత్ కి తప్పకుండా స్థానం ఉంటుందట. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  మొన్నే ఐపీఎల్ లోకి వచ్చిన రిషబ్ పంత్ కు అంతలోనే టీమ్ ఇండియాలో ఛాన్స్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి.

మరింత సమాచారం తెలుసుకోండి: