ఐపీఎల్ అంటే నీకు అలుపు వస్తుందేమో.. కానీ నాకు మాత్రం ఊపొస్తుంది అనే రీతిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దినేష్ కార్తీక్ ప్రస్థానం కొనసాగుతోంది. దాదాపు అతని కెరియర్ ముగిసిపోయింది అని వార్తలు వస్తున్న ప్రతీసారి కూడా ఏకంగా బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో చూపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం అతని వయస్సున్న క్రికెటర్లు అందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక అతనికి అడపాదడపా అవకాశాలు మాత్రమే దక్కడంతో అందరితో పోల్చి చూస్తే కాస్త ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించాలి. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు.


 గతంలో 2022 t20 వరల్డ్ కప్ కి ముందు ఐపిఎల్ లో బ్యాటింగ్ విధ్వంసం సృష్టించి టి20 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన దినేష్ కార్తీక్.. ఇక ఇప్పుడు 2024 ఏడాదిలో జరగబోయే పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్  టీమ్ లోకి మరోసారి వచ్చేలాగే కనిపిస్తూ ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న దినేష్ కార్తీక్ అదరగొడుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డీకే.. ఇక ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా జట్టును గెలిపించినంత పని చేశాడు. ఒకవేళ అతను మరికొంత సేపు అటు క్రీజ్ లో ఉండి ఉంటే తప్పకుండా ఆర్సిబి గెలిచేది అని అభిమానులు కూడా బలంగా నమ్మారు. ఏకంగా బౌలర్ వేసిన ప్రతి బంతిని కూడా బౌండరీకి తరలించడమే లక్ష్యంగా వీరబాదుడు బాదాడు దినేష్ కార్తీక్  అయితే ఇక దినేష్ కొట్టిన ఒక సిక్స్ మాత్రం అతనికి వరల్డ్ కప్ జట్టులోకి రావాలనే కోరిక ఎంత బలంగా ఉంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. నటరాజన్ వేసిన బంతిని అతను భారీ సిక్సర్ కొట్టగా.. అది 108 మీటర్ల దూరం వెళ్ళింది  అయితే ఆ బాల్ స్టేడియం పై రూఫ్ ను తాకి మళ్ళీ మైదానంలో పడింది. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్ 2024 లో ఇప్పటివరకు ఇదే లాంగెస్ట్ సిక్సర్ కావడం గమనార్హం. ఇక ఇదే మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్ క్లాసేన్  106 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఇక ఇదే సీజన్లో వెంకటేష్ అయ్యర్, పూరన్ లు కూడా 106 సిక్సర్ల సిక్సర్లు కొట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl