ప్రస్తుతం ఇండియాలో ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారీ స్కోర్లకు వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మునుపన్నడు లేని విధంగా ఈసారి బ్యాట్స్మెన్లు ఇక వీర విధ్వంసం సృష్టిస్తున్నారు. సిక్సర్లు ఫోర్లతో చెదిరేగిపోతూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎందుకు బౌలర్ అయ్యామా అని ప్రతి ఒక్క ఆటగాడు భయపడి, బాధపడే విధంగా ఇక బ్యాట్స్మెన్ల విధ్వంసం కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో  ప్రతి మ్యాచ్లో కూడా 200 కు పైగా స్కోర్ నమోదు అవుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఒక జట్టు భారీ స్కోరు నమోదు చేస్తుంది అనుకునే లోపే ఇక మరో టీం కూడా అదే రీతిలో 200కు పైగా పరుగులు చేస్తూ ఉండటం గమనార్హం. ఒకప్పుడు ఒక జట్టు 200కు పైగా స్కోర్ చేసిందంటే అదే గొప్ప అనుకునే విధంగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు 2024 ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లోను 250 ప్లస్ స్కోర్లు నమోదు అవుతూ ఉన్నాయి. బ్యాట్స్మెన్ ల బాదుడికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి గ్రౌండ్ లో బౌండరీ లైన్ల పరిధిని పెంచాలి. ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ కు క్యాచ్ కు తేడా లేదు. రెండు మూడు మీటర్ల వరకు బౌండరీ పరిధి పెంచాలి. లేదంటే బౌలర్లు ఇబ్బంది పడతారు. ప్రతి మ్యాచ్ లో బౌలర్లు బ్యాట్స్మెన్ ల మధ్య హోరా హోరి పోరు జరిగితేనే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిసారి బ్యాట్స్మెన్ లదే ఫైచేయి అయితే మ్యాచ్ బోర్ కొడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గావాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl