ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చినా ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాకౌట్ మ్యాచ్ లు కూడా పూర్తి కాబోతున్నాయి. దీంతోఇక ఐపీఎల్ సీజన్లో టైటిల్ విజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.


 అయితే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. తమ అభిప్రాయం ప్రకారం కచ్చితంగా ఏ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందో అనే విషయాన్ని ముందుగానే ఊహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న.. మాజీ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ సైతం  ఐపిఎల్ లో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే అనూహ్యంగా అటు ప్లే ఆఫ్స్ లో అర్హత సాధించిన బెంగళూరు టీం టైటిల్ గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.



 కానీ రికీ పాంటింగ్ అంచనా మాత్రం తారుమారు అయింది. ఎందుకంటే ఇటీవల రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేసిన ఆర్సిబి జట్టు చివరికి ఓటమిపాలు అయింది. ఎంతో కష్టం మీద ప్లే ఆఫ్స్ లో అర్హత సాధించిన జట్టు ఇక టైటిల్ రేసులో మాత్రం నిలవలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇక రికీ పాంటింగ్ ఆర్సిబి టైటిల్ గెలుస్తుంది అని చెప్పి పప్పులో కాలేశాడు అంటూ ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకోవైపు ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తప్పకుండా కప్పు గెలుస్తుంది అని బలంగా నమ్మిన అభిమానులు అందరూ కూడా మళ్లీనిరాశ తప్పలేదు అంటూ అసంతృప్తితో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl