టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో క్రేజీ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లో కోహ్లీ అంటే తెలియని ప్రేక్షకుడు లేడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిలా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో అందరికీ నిరూపించాడు. ఈ క్రమంలోనే అందరిలా వచ్చి పోయే ఆటగాడిని కాదు వరల్డ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు.


 ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన అధికారులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు విరాట్ కోహ్లీ.  సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్లను సంపాదించుకోవడంలో తనను మించిన వాళ్లు లేరు అని ఇప్పటికే అందరికీ అర్థమయ్యేలా చేశాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ గురించి ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు సోషల్ మీడియాలో వరస పోస్టులు పెడుతూ ఉండటం సంచలనంగా మారింది. అయితే కోహ్లీ పేరు ప్రస్తావించకపోయినా అంబటి రాయుడు పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే కోహ్లీని టార్గెట్ చేశాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.


 ఇకపోతే ఇటీవలే మరోసారి అంబటి రాయుడు అటు విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ  సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే ఆరెంజ్ క్యాప్ ఉంటే సరిపోదు అంటూ అంబటి రాయుడు కామెంట్ చేశాడు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ను విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీని ఉద్దేశించి అంబటి రాయుడు ఈ కామెంట్స్ చేశాడు అని ఇక సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఇక ఆర్సిబి లోని యువ ఆటగాళ్లు బాగా ఆడాలంటే కోహ్లీ తన స్థాయిని తగ్గించుకొని ఆడితే బాగుంటుంది అంటూ మొన్నటికి మొన్న రాయుడు చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: