ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ ను టీమిండియా క్లీన్ స్విప్ చేయగలదా లేదా అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ఫలితం కోసం టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రచించిన వ్యూహం ఫలించింది. ఎటాకింగ్ గేమ్ తో విజయం పై కన్నేసిన టీమ్ ఇండియా ఆ చివరికి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఏకంగా టి20 తరహాలో భారత బ్యాట్స్మెన్లు చితక్కొట్టారు. వాళ్లు ఆడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 50, 100, 150, 200, 250 పరుగులను అత్యంత వేగంగా నమోదు చేసిన జట్టుగా అటు భారత్ చరిత్ర సృష్టించింది.
అయితే భారత జట్టు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసి చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్నప్పటికీ అటు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం ఓ విషయంలో అసంతృప్తితో ఉన్నాడట. అదే జట్టు బ్యాటింగ్ లైనప్ విషయంలో జియో సినిమాలో తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత ఇన్నింగ్స్ లో రెండో వికెట్ గా యశస్వి జైష్వాల్ అవుట్ అయినప్పుడు నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి వస్తాడని ఎంతో మంది ఎదురుచూసారూ. అయితే అందరిని ఆశ్చర్య పరిచే విధంగా రిషబ్ పంత్ ను మేనేజ్మెంట్ ముందు పంపింది. ఆ తర్వాత ఐదో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ వచ్చాడు. టెస్ట్ క్రికెట్లో 9,000 కు పైగా పరుగులు చేసిన కోహ్లీని నాలుగో స్థానంలోనే పంపాల్సింది అంటూ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.