ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో బూమ్రా, కరుణ్ నాయర్ మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా గ్యాప్ తర్వాత IPLలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్‌కి ఫాఫ్ డుప్లెసిస్ ఇంజూరీ కారణంగా ఆడే ఛాన్స్ దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే 89 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టించాడు. కరుణ్ బ్యాటింగ్ చూస్తే ఢిల్లీ ఈజీగా గెలిచేలా అనిపించింది. కానీ ముంబై మాత్రం గట్టిగా పోరాడి 12 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచింది.

అయితే కరుణ్ దుమ్మురేపుతున్న టైమ్‌లో బూమ్రాతో అతనికి చిన్న క్లాష్ జరిగింది. డబుల్ రన్ తీస్తుండగా కరుణ్ అనుకోకుండా బూమ్రాని ఢీకొట్టాడు. కావాలనే చేశాడని బూమ్రా ఫీల్ అయ్యాడు. వెంటనే కరుణ్ సారీ చెప్పినా బూమ్రా అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కరుణ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకి కూడా సిచ్యూయేషన్ చెప్పేందుకు ట్రై చేశాడు.

అయితే బూమ్రా సీరియస్‌గా ఉంటే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఫుల్ ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. నవ్వుతూ కరుణ్‌ని ఆటపట్టించినట్లు కనిపించాడు. రోహిత్ రియాక్షన్ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

చాలా మంది ఫ్యాన్స్ బూమ్రా రియాక్షన్‌ని ఓవర్ అంటున్నారు. కరుణ్ అంతకుముందు ఓ రేంజ్‌లో బూమ్రా బౌలింగ్‌ని ఊచకోత కోయడంతోనే బూమ్రా అలా సీరియస్ అయ్యాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. కామెంటేటర్లు కూడా బూమ్రా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు అనిపించిందని అన్నారు.

ఢిల్లీ ఓడిపోయినా.. కరుణ్ నాయర్ ఇన్నింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. రీసెంట్‌గా రంజీ, విజయ్ హజారే ట్రోఫీల్లో కూడా దుమ్మురేపిన కరుణ్.. టీ20 ఫార్మాట్‌లో కూడా తన సత్తా చాటాడు. సెలెక్టర్లకి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కరుణ్ గట్టిగానే మెసేజ్ పంపించాడు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని మీరు కూడా చూసేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: