టీమిండియా ప్రముఖ క్రికెటర్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ధోని తన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఎంతోమంది క్రికెటర్లకు ధోని మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఇక ధోని సాక్షి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఓ పాప కూడా ఉంది. ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా వారి వైవాహిక జీవితం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధోనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. 

ధోని తన వివాహానికి ముందు ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా అనేక రకాల ప్రచారాలు గతంలో జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోని, లక్ష్మీరాయ్ ఇద్దరు కలిసి చాలా సందర్భాలలో బయట కనిపించారు. అనేకసార్లు కెమెరాల కంట కూడా పడ్డారు. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని అంతా అనుకున్నారు. వీరు డేటింగ్ లో ఉన్నట్టుగా త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారని గతంలో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ఏం జరిగిందో తెలియదు వీరిద్దరూ 2014 సంవత్సరంలో విడిపోయారు. అనంతరం వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించలేదు. ధోని చాలా తక్కువ సమయంలోనే వివాహం చేసుకున్నాడు. ఇక లక్ష్మీరాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ధోని గురించి ప్రస్తావిస్తూ వారి రిలేషన్ పైన స్పందించింది. ధోనితో నా సంబంధం ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఈ విషయంపైన గతంలోనే అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇప్పటికి ఈ విషయం పైన ప్రజలు చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఒకవేళ రేపు నా పిల్లలు కూడా ఇదే విషయంపైన నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ లక్ష్మీరాయ్ ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం లక్ష్మీరాయ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: