ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే ఆర్సిబి  "రాయల్ చాలెంజర్స్ బెంగళూరు". ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేస్తుంది.  కనీ విని ఎరుగని రీతిలో ఆట తీరును కనుబరుస్తుంది . అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఫైనల్ కీ చేరుకున్న ఈ జట్టు కలల కప్పుకు ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో నిలిచింది.  ఆల్మోస్ట్ ఈసారి కప్పు ఆర్సిబిదే అంటూ జనాలు పూర్తిగా ఫిక్స్ అయిపోయారు. సర్వేలు కూడా అదే విధంగా ఫలితాలు ఇస్తున్నాయి. కేవలం ఒక్క మ్యాచ్ ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు ఆ టీం నిరీక్షణకు తెరపడుతుంది .


"ఈ సాల కప్ నాందే" అని ఆర్సిబి ఫ్యాన్స్ గర్వంగా  చెప్పుకుంటారు. లీగ్ దశలో దాటుకొని ప్లే ఆఫ్ కు చేరుకున్న ర్బి ఆర్సిబి గురువారం మొదటి క్వాలిఫైయర్ లో మరింత చెలరేగి ఆడి అందరినీ మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. మహాలీలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది ఆర్సిబి . ఇలా ఐపిఎల్ 2025లో ఫైనల్గా చేరిన మొట్టమొదటి జట్టుగా ఆర్సిబి రికార్డ్ క్రియేట్ చేసింది.  గత తొమ్మిదేళ్ల తర్వాత ఐపిఎల్ ఫైనల్ ఆడుతూ ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అంతేకాదు ఈసారి ఆర్సిబి ఆట తీరు చూస్తుంటే అందరూ కప్పు ఆర్సిబిదే అంటూ ఫిక్స్ అయిపోయారు .

 

డౌట్ లేదు కప్పు తమదే అనే ధీమాతో ఉన్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా కొంతమంది దీనిపట్ల రకరకాలుగా మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈసారి కప్పు ఆర్సిబిదే అని .. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ  గెలిచాక బెంగుళూరు దేశ రాజ ధానిగా ప్రకటించాలి అని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు . దేశ రాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం నిండిపోయింది అని.. కాబట్టి రాజధానిని బెంగళూరుగా మార్చాలి అంటూ కొంతమంది బెంగళూరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఢిల్లీ కంటే బెంగుళూరు అన్ని విషయాలలో చాలా బెటర్ అని ఢిల్లీలో  లా బెంగళూరులో కాలుష్యం ఉండదు అని ..మంచి వాతావరణం పీస్ఫుల్ అట్మాస్పియర్ ఉంటుంది అని.. అలాగే నగరం ఐటీ హబ్ స్టార్ట్ అప్ లకు కేంద్రం .. తక్కువ కాలుష్యం ఉండడంతో ఇక్కడ జీవించే వారికి మంచి వాతావరణం లభిస్తుంది అని ఇంకెందుకు ఇండియా క్యాపిటల్గా ఢిల్లీని తీసేసి బెంగళూరు ని పెట్టేసేయండి అంటూ రకరకాలుగా మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: