
అయితే ఎందుకు అసలు చిన్న స్వామి స్టేడియం వద్ద ఇలాంటి తొక్కిసలాట జరిగింది..? ఈ విషయంలో నిర్లక్ష్యం వహించింది ఎవరు ..? అనే విషయాలు ఇప్పుడు ఎక్కువగా జనాలు డిస్కస్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఆల్రెడీ బెంగళూరు గవర్నమెంట్ ఐపిఎల్ గెలిచిన ఆర్సిబి టీంకు ముందుగానే హెచ్చరిచిందట . "ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మీరు పెరేడ్ లాంటిది ప్లాన్ చేస్తే కచ్చితంగా జనాలు ఎక్కువగా వస్తారు. ఆ జనాలను కంట్రోల్ చేసే అంత కెపాసిటీ ..పోలీస్ ఫోర్స్ ఇక్కడ లేదు . మీరు ఈ పెరేడ్ లాంటివి నిర్వహించకపోవడం మంచిది అంటూ ముందుగానే సూచించారట".
కానీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించి ఆర్సిబి మేనేజ్మెంట్ ఈ పెరేడ్ ను అనుకున్న విధంగానే ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేసిందట. అదే టైం లో బెంగుళూరు ట్రాఫిక్ ఎంత ఉంటుందో అందరికి తెలుసు. అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ రూట్ ని వేరే మార్గంలో మళ్ళించారట. అయితే ఎవరూ ఊహించిన విధంగా చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ భారీ తొక్కలాట జరిగింది . ఆర్ సి బి మెంబర్స్ ని చూడడానికి ఐపీఎల్ కప్ చూడడానికి చాలామంది జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు తగిన విధంగా వాళ్లకి రక్షణ కల్పించలేకపోయారు .
కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో హద్దులు మీరిన అభిమానం చూపిస్తూ అరుపులు కేకలతో ఒకరి మీద ఒకరు వాలిపోవడంతో ఆ జనసంద్రోహానీ పోలీసులు అక్కడ కంట్రోల్ చేయలేక ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు చెప్పినట్లు ముందుగానే ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేయలేం అని ఆర్సిబి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉన్నా.. ఈ ప్రోగ్రాం ని ఒక వారం తర్వాత పెట్టుకుని ఉన్న ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా 18 ఏళ్ల కల నెరవేరింది అన్న సంతోషంలో బెంగుళూరు మొత్తం పండగ చేసుకుంటుంటే.. ఆ 11 మంది మరణించిన కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర దుఃఖంలో ఉండిపోయారు . ఇప్పుడు ఈ 11 మందిని చంపిన పాపం ఎవరిది ..? అంటూ సోషల్ మీడియా వేదికగా జనాలు ప్రశ్నిస్తున్నారు . ఒకవేళ ఆర్ సి బి మేనేజ్మెంట్ పోలీసులు చెప్పినట్లు వినుంటే ఇలాంటి ఒక పరిస్థితి దాపురించిందే కాదుగా అంటూ ఆర్సిబి మేనేజ్మెంట్ పై కూడా మండిపడుతున్నారు..!