ఇంగ్లాండ్ తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్ లో ఇండియా తరఫున రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు యంగ్‌ ప్లేయర్‌ రిషబ్‌ పంత్‌ .. అయితే ఇదే క్రమంలో అతను ఒక తప్పు కూడా చేశాడు .  అలా పంత్‌ తీరుపై ఐసీసీ అతని గట్టిగా మందలించింది కూడా .. లెవెల్ వన్ కింద పంత్‌ను దోషిగా తీర్మానించింది .. అలాగే ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ అతని మందలించి మొదటి తప్పుగా వదిలేశారు .. దీని ద్వారా అతనిపై తదుపరి చర్యలు ఎలాంటివి తీసుకోలేదు .. ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఎంపైర్ నిర్ణయాన్ని లెక్క చేయకపోవడం లేదా అభ్యంతరం చెప్పడం వంటి పనులు ఆర్టికల్ 2.8 కిందకి వచ్చి చేరుతాయి .. ఇక ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా ఐసిసి అతని దోషిగా తెలుస్తూ పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తుంది .. అలాగే ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఇప్పుడు  పంత్ ఖాతాలో 1 డీమెరిట్ పాయింట్  ని కూడా జోడించింది ..


పంత్‌ చేసిన తప్పు ఏమిటంటే ? ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే .. రిషబ్ పంత్ మందులించబడిన ఆ తప్పును ఎప్పుడు చేశాడా అని .  ఇక ఈ ఘటన లీడ్స్ టెస్ట్ మూడో రోజున చోటుచేసుకుంది .. మొదటి ఇన్నింగ్స్ 61 వ ఓవర్ లో .. బాల్ ఆకారం మారిందని, దాన్ని మార్చాలని ఫీల్డ్ ఎంపైర్ ని కోరాడు .. అయితే ఎంపైర్ బాల్ ని తనిఖీ చేసి కొత్త బంతిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు .  ఇక దాంతో కోపానికి గురైన పంత్ .. ఎంపైర్ చేతిలోని బాల్ ని తీసుకుంటూ అతనితో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు .. అంతేకాకుండా కోపంతో బాల్ ని నేలపై విసిరాడు .. ఇలా ఐసీసీ నిబంధన ప్రకారం ఎంపైర్ తో ఒక ఆటగాడు ఇలా ప్రవర్తించడం కఠినమైన నేరం అందుకే పంత్‌ను ఐసీసీ మందలించింది ..



మ్యాచ్ రిఫరీ ముందు తన తప్పును ఒప్పుకున్న పంత్ : ఐసీసీ పత్రిక ప్రకటన ప్రకారం .. రిషబ్ పంత్ తన తప్పును మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ ముందు ఒప్పుకున్నాడు .. ఇక దీంతో అతను పై తదుపరి విచారణ పనిలేకుండా పోయింది .  ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రైఫిల్ , క్రిస్ జాఫ్నీ, మైదానంలో పంత్‌ ప్రవర్తన పై మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ చేశారు .. ఇక వీరందరితో పాటు థర్డ్ ఎంపైర్షర్ఫుదుల్లా, నాలుగవ ఎంపైర్ అంపైర్ మైక్ బర్న్స్ ఈ ఆరోపణలే చేశారు .. ఇక దీంతో లెవెల్ వన్ కింద దోషులుగా నిరుపేతలైన ఆటగాళ్లకు కనీస శిక్ష మందలింపు .. గరిష్ట శిక్ష వారి మ్యాచ్ ఫీజులో 50% కోత .. లేదా రెండు డీమెరిట్  పాయింట్లు వారి ఖాతాలో జోడించడం ..

మరింత సమాచారం తెలుసుకోండి: