ఎలెన్ మస్క్..స్టార్ లింక్.. ఈ పేర్లకు  నెల రోజులుగా ప్రసార మాధ్యమాలలో , ముఖ్యంగా భారత్ లో విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ప్రపంచ శ్రీమంతుల్లో ఎలెన్ మస్క్ ఒకరని,  నింగికీ, నేలకు ఇంటర్నెట్ అనే నిచ్చేన వేయనున్నాడని,  ఢిల్లీ చుట్టు పక్కల వంద పాఠశాలలకు సాంకేతి సాయం ఉచితంగా చేయనున్నాడని.... ఇలా ప్రసార మాధ్యమాలు విపరీత ప్రచారం కలిపించాయి. ఇవి నిజం కావచ్చు కూడా.. ప్రస్తుతం భారత్ లో ఆయన సంస్థ స్టార్ లింక్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఎలెన్ మస్కా కు చెందిన స్టార్ లింక్ కంపెనీ ప్రభుత్వం నుంచి లైసెన్స్ మంజురయ్యే వరకూ తన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ సంస్ధలో సభ్యత్వం తీసుకోవద్దని, లావాదేవీలు ఏవీ జరప వద్దని భారత ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.
స్టార్ లింక్ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని  కేంద్రం స్పష్టం చేసింది. భారత్ లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉండాలని,  ముందస్తు బుకింగ్ లు చేయరాని ప్రభుత్వం సూచించింది.
 భారత దేశంలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహించుకునేందకు స్టార్ లింక్ సంస్థ నవంబర్ 1న ప్రభుత్వం వద్ద  తన పేరును నమోదు చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు ఇంకా లైసెన్స్ మంజూరు కాలేదు. ఈ లోపలే  స్టార్ లింక్ తన వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలను మొదలు పెట్టింది. తదనుగుణంగా ప్రకటనలు ఇచ్చింది. వ్యాపార భాగస్వాములను నమోేదు చేసుకోవడం ఆరంభించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భారత ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఎలెన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపేనీకి కూడా తాకీదులు జారీ చేసింది.  అయిత్ స్టార్ లింక్ కంపెనీ గానీ, ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు గానీ ఈ విషయమై ఎవ్వరూ పెదవి విప్పలేదు.
 బ్రాడ్ బ్యాండ్ సేవలు  అందుబాటులో లేని ప్రాంతాలలో  శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కల్పించేందుకు స్టార్ లింక్ ముందుకు వచ్చింది. ముఖ్యంగా  గ్రామీణ ప్రాంతాల వారికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించే  దిశగా అడుగులు వేసింది. లక్ష్యం కూడా పెద్దదిగానే నిర్దేశించుకుంది. ఆ  కేవలం ఒక్క నెల రోజుల  లోనే అంటే డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభించి ఆ నెలా ఖరు లోగా రెండు లక్షలకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్ లు ఇవ్వాలని స్టార్ లింక్ నిర్దేశించుకుంది. అయితే ప్రభుత్వం  ఈ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలికంగా నో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: