అంటార్కిటికా ఖండం గురించి అందరికి ఓ ఐడియా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి స్కూల్ పుస్తకాల్లో ఇంకా లైబ్రరీలో అలాగే ఇంటర్నెట్ లో దీని గురించి చాలా విషయాలు తెలుసుకునే ఉంటాం. ఇది మానవులు నివసించలేని భయంకరమైన చలి వుండే ప్రాంతం. ఇప్పటికీ కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ఇది చాలా భయంకరమైన ప్రదేశం ఇక్కడ మనిషి బ్రతకలేడు అని నిరూపించారు. ఇక ఈ ఖండంలో థ్వాయిట్స్ హిమానీ నదం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలో అత్యంత భారీ మంచు కొండ. ఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్.. కొంతకాలంగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల శరవేగంగా కరిగిపోతుంది. ఇప్పుడు అది ముని వేళ్ళ పై నిలబడి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించే శాస్త్రవేత్తలు థ్వాయిట్స్ కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్ డే గ్లేషియర్) అని పేరు పెట్టారు. ఈ గ్లేషియర్ తో పాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం ఏకంగా మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. తీర ప్రాంతాల్లో చాలావరకు నీట మునుగుతాయి.


థ్వాయిట్స్ హిమానీ నదం పై ఇటీవల అమెరికా, స్వీడన్, యూకే శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత రెండు శతాబ్దలకంటే ఇటీవల కాలంలో థ్వాయిట్స్ హిమానీ నదం ఎక్కువ కరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నేచర్ జియో సైన్స్ పత్రికలో ప్రచురించారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ప్రతిఏటా 1.3 మేళ్లకు పైగా ( 2.1 కిలోమీటర్లు) కరిగిపోతున్నట్టు తేల్చారు. ఇది ఇలాగే కొనసాగితే సముద్రమట్టం పెరిగి సమీపంలోని ఆవాసాలు పూర్తిగా మునిగిపోతాయి. అరుదైన జీవజాలానికి వాటిల్లుతుంది.థ్వాయిట్స్ హిమానీ నదం కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టం దాదాపు పది అడుగుల మేర పెరుగుతుంది.థ్వాయిట్స్ హిమానీ నదం కరుగుతుండటం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి.ఇది పూర్తిగా కరిగితే పూర్తిగా ప్రపంచం అంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: