బిగ్ బాస్ లో లవ్ జంట గా పేరు తెచ్చుకున్న అరియనా, అవినాష్ లు బయట కూడా అదేవిధంగా రచ్చ రచ్చ చేస్తున్నారు. యాంకర్ గా పలు ఛానల్స్ లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న అరియనా ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం దక్కించుకోగా అక్కడ ఫైర్ బ్రాండ్ గా, బోల్డ్ గా ప్రేక్షకులను మెప్పించింది. టాస్క్ లు, అభిమానం, ఆత్మస్థైర్యం విషయంలో అందరికి ఆదర్శంగా నిలవగా అరియనా టాప్ 5 లో నిలిచి బయటకి వచ్చింది. అయితే ఈమె జర్నీ లో ఎక్కువగా ఆకట్టుకుంది కమెడియన్ అవినాష్ తో ఫ్రెండ్షిప్.. అవినాష్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇద్దరు ఎంతో దగ్గరయ్యారు. ఒకానొక టైం లో ఈ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అన్న ఫీల్ ఆడియెన్స్ కి కలిగింది. వారి చేష్టలు కూడా అలాగే ఉన్నాయి.