సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరు చూసిన ఏదోవిధంగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటారు. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ సీరియల్స్ ద్వారానైనా, అందుకు సంబంధించిటువంటి యాడ్స్ ద్వారా అయినా డబ్బులు పోగేసుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే ఏకంగా షాపింగ్ మాల్స్ వంటి ఓపెనింగ్స్ కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెళ్తున్నారు.


కానీ ఆహారపు ఉత్పత్తులపై ఈ మధ్యకాలంలో మన సెలబ్రిటీస్ తక్కువగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకొనే ఒక సెలబ్రిటీ మాత్రం ఆహారపు ఉత్పత్తులపై ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం ఉచితంగానే ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు ఇంద్రనీల్ భార్య మేఘన.. ఈమె కస్తూరి ఫుడ్స్, అన్నపూర్ణ పచ్చళ్ళు వాటిపై ఉచితంగానే ప్రమోట్ చేస్తున్నదట.


అంతే కాకుండా వాటిని రుచి చూసి అందుకు తగ్గ రివ్యూలు కూడా ఇస్తున్నది. ఇలా రివ్యూలు చూసి ఈమె చెప్పడం వల్ల చాలా మంది వాటిని కొని తినడం ప్రారంభించారు.అలా తీసుకుపోయిన వారిలో కొంతమందికి చేదు అనుభవం ఎదురైంది. వారిలో కొంతమంది మీరు బాగున్నాయి అని చెప్పడం చేతనే మేము తీసుకున్నాము.. అని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ అవి బాగోలేవు అన్నట్టుగా కూడా కామెంట్ చేస్తున్నారు.

నెటిజన్లు పెట్టిన కామెంట్స్ కు ఈమె ఒక రిప్లై ఇస్తూ,  తనకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అదేమిటంటే.. నాకు పంపిన ఆహార పదార్థాలు చాలా బాగున్నాయి . కాబట్టి నేను వాటికి రివ్యూ ఇచ్చాను అన్నట్లుగా తెలుపుతూ వచ్చింది. కానీ వాటిని తీసుకున్న కొంతమంది మాత్రం చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. దీనిపై ఆమె ఆయా సంస్థలతో మాట్లాడాను,మీకు ఎలాంటివి పంపిస్తామో మా దగ్గర నుంచి తీసుకున్న వారికి కూడా అలాంటివి పంపిస్తాము అన్నట్లుగా చెబుతున్నారని ఒక వీడియోని షేర్ చేసింది ఈమె.అయితే ఈమె ప్రేక్షకుల మేరకు ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుండటంతో ఆ వీడియోలను డిలీట్ చేసింది. అంతేకాకుండా నేను ఇలాంటి ఆహారపు ఉత్పత్తులను ప్రమోట్ చేసే దానికోసం ఎలాంటి డబ్బులు తీసుకోను అని తెలియజేసింది. అంతేకాకుండా తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అంటూ తెలుపుతూ వచ్చింది మేఘన.



మరింత సమాచారం తెలుసుకోండి: