* ఈటివి ప్లస్ లో 'నేను శైలజ' సీరియల్ తో అందరికీ దగ్గరయిన బాలుగా చేసిన ఏక్ నాథ్ అలాగే శైలజ గా నటించిన జయ హరికలు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం జయ హారిక స్టార్ మా లో ప్రసారమవుతున్న చెల్లెలి కాపురం సీరియల్ లో నటిస్తుండగా...ఏక్ నాథ్ కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తున్నారు.
* నిరుపమ్ మరియు మంజులలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మొదట 'చంద్రముఖి' అనే సీరియల్ చేస్తున్న సమయంలో ప్రేమ మొదలవ్వగా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిరుపమ్ కార్తీక దీపం సీరియల్ లో నటిస్తుండగా మంజుల బంగారు పంజరం సీరియల్ లో కనిపించేది. అయితే నిన్నటితో ఆ సీరియల్ కి కూడా శుభం కార్డ్ పడింది.
* ఇక సిద్దార్థ్ వర్మ , విష్ణు ప్రియ వీరిద్దరూ కలిసి రక్త సంబందం, కుంకుమ పువ్వు వంటి సీరియల్స్ లో కలిసి నటించారు. వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ 'జానకి కలగలేదు' సీరియల్ లో నటిస్తూ అలరిస్తున్నారు.
అలాగే సీనియర్ నటులు హారిక, జాకీ లు కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి