తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా మంచి పేరు సంపాదించిన వారిలో రష్మీ కూడా ఒకరు. ఇక ఈమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సుదీర్ రష్మీ జోడి బుల్లితెర పై షో లు చూసే ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. బుల్లితెర పైన యాంకర్ గా చేస్తుండగానే రష్మి పలు సినిమా లలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉండేది. ముఖ్యంగా రష్మీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈ ముద్దుగుమ్మ రాను రాను తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంది . ఇక ఇప్పుడు రష్మి సినిమాలలో కూడా అవకాశాలు బాగానే అందుకుంటోంది. అయితే రష్మీ హీరోయిన్ గా ఎలా అవకాశం వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే రష్మీ మొదట హోలీ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది.  ఆ తర్వాత ప్రస్థానం గణేష్ , బిందాస్ , కరెంట్ తదితర చిత్రాలలో కూడా చిన్నచిన్న పాత్రలలో నటించింది. కానీ మొదట తమిళ్లో కందేన్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రష్మి. ఈ ఆఫర్ రావడానికి ముఖ్య కారణం నటి సంగీతానేనట. తెలుగులో పలు చిత్రాలను నటించిన ఈమె ఇక్కడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సంగీత.  అలా ఒక రియాలిటీ షోలో రష్మి ని చూసి రష్మీ గురించి తమిళ్ డైరెక్టర్ ముగిల్ కి తెలియజేసిందట.

అలా తను నటించబోతున్న కందేన్ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. శాంతాను భాగ్యరాజ్ , సంతానం , రష్మీ ఇందులో కీలకమైన పాత్రలో నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నటన పరంగా రష్మీకి మంచి మార్కులు పడ్డాయి. అటు తరువాత తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన రష్మీ. చివరిగా బొమ్మ బ్లాక్ బాస్టర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: