బిగ్ బాస్ షో పై చాలా కాలంగా వ్యతిరేకత వస్తూనే ఉన్నది. అయితే ఈసారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు బిగ్ బాస్ వివాదం మరింత ముదిరిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఫినాలే తర్వాత చాలా గొడవలకు దారితీసింది. దీంతో కార్లు బస్సులు వంటివి ధ్వంసం అవ్వడంతో పాటు బిగ్ బాస్ విన్నర్ అయిన ప్రశాంత్ కిషోర్ కూడా అరెస్టు కావడంతో ఏకంగా ఈ షోకు పోలీసులు నోటీసులు జారీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా బిగ్ బాస్ షో నిర్వాహకులు సైతం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది అందరికీ షాక్ అయ్యేలా కనిపిస్తోంది.


 హిందీ భాషలో ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా ప్రసారం అవుతోంది. మొదట ఎన్టీఆర్ ,నాని వంటి హీరోలు సైతం హోస్టుగా చేయగా ఆ తర్వాత నాగార్జున ఇందుకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.. ఈ షోలో 100 రోజులపాటు కంటిస్టెంట్లను ఉంచి పలు రకాల పోటీలు పెట్టి ఇందులో గెలిచిన వారిని విజేతగా ప్రకటించేవారు. అలా ఈసారి కామన్ మ్యాన్ , రైతు బిడ్డ అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచారు.

 రైతుబిడ్డ అనే ట్యాగ్ తో పల్లవి ప్రశాంత్ ఎలా ఆడారు అనే విషయం పక్కన పెడితే ఫినాలి జరుగుతూ ఉండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఫ్యాన్స్ ఎక్కువగా ర్యాలీలు వంటివి చేయడం జరిగింది.ఈ విషయం పైన పోలీసులు ప్రశాంత్  ని హెచ్చరించారు. ఇలాంటి వాటిని లెక్కచేయకుండా అభిమానులు దగ్గరకి ప్రశాంత్ రావడంతో పాటు పలువురు కంటిస్టేంట్ల కార్లను పోలీసు వాహనాలను సైతం ఇతర గవర్నమెంట్ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో కొద్ది రోజులు చంచల్గూడా జైల్లో ప్రశాంత్ ని పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైనా సరే ర్యాలీలు వంటివి చేయకూడదని ఇలాంటి వాటిని అగ్రిమెంట్లో పొందపరచబోతున్నారట. ఇవే కాకుండా పలు రకాల విషయాలను కూడా అగ్రిమెంట్లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: