
అయితే పావని రెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే .. ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే వీరి కాపురం సజావుగా సాగకపోవడంతో పావని రెడ్డి మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కొన్ని రోజులపాటు డిప్రెషన్ లో ఉన్న పావని రెడ్డి ఆ తర్వాత పలు షోలలో కనిపించి మెరిపించింది.. ఆ తర్వాత ఈమె కొరియోగ్రాఫర్ అమీర్ తో మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్నది.
చివరికి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నట్టుగా తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసింది. సాంప్రదాయంగా జరిగిన వీరికి పెళ్లి పనులకు అటు స్నేహితులు, బంధుమిత్రులు హాజరయ్యారు. వివాహానికి సంబంధించి కూడా పావని ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ .. న్యూ బిగినింగ్ స్టార్ట్ అనే క్యాప్షన్ ను జత చేయడం జరిగింది. దీంతో ఈ పోస్ట్ చూసినా అభిమానులు పలువురు నెటిజెన్సు కూడా పావని , అమీర్ కు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా పావని రెడ్డి తిరిగి మళ్ళీ అటు సినిమాలలో, సీరియల్స్లలో నటిస్తుందో లేదో చూడాలి మరి.