ఇటీవ‌ల కాలంలో.. రోజురోజుకూ వాట్సప్‌ వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. వాట్సాప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇక సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్స‌ప్ ఇంట్ర‌డ్యూస్ చేసిన వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్ అయింది. రోజూ కోట్ల‌లో  యూజ‌ర్లు దీన్ని వినియోగిస్తున్నారు.

 

వాట్సప్‌ ఫీచర్లలో యూజర్లను బాగా ఆకట్టుకున్న, బాగా నచ్చిన ఫీచర్ 'స్టేటస్'. వాట్సప్‌లో స్టేటస్ చూడనివారు, స్టేటస్ అప్‌డేట్ చేయనివారు దాదాపుగా ఉండరు. అయితే వాట్సప్ స్టేటస్‌ ఉపయోగిస్తున్నవారికి త్వరలో షాక్ ఇవ్వనుంది కంపెనీ. వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేయనుంది. . ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరిగానే వాట్సాప్‌లో కూడా యూజర్లకు యాడ్స్‌ కనిపించనున్నాయి. ఇప్పటిదాకా కొన్నింటికే పరిమితమైన ఈ యాడ్‌లు ఇకపై వాట్సప్‌లో కూడా డిస్‌ప్లే అవుతాయని నెదర్లాండ్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ సమ్మిట్‌ 2019లో ఆ సంస్థ వెల్లడించింది. 

 

ఇక‌ త్వరలోనే వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది కంపెనీ. కాకపోతే ఈ యాడ్స్‌ ఫీచర్‌ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై మాత్రం ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాట్సప్ రిలీజ్ చేసిన ఫీచర్లలో ఎక్కువగా యూజర్లకు నచ్చింది స్టేటస్ ఫీచరే. అలాంటి స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేస్తే యూజర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. ఏదేమైనా ఇది యూజ‌ర్ల‌కు కాస్త త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉందంటున్నారు కొంద‌రు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: