ఆ తర్వాత కాల్ కట్ చేయాల్సిందే. ఆఫీసు మీటింగులు కొంచెం ఆలస్యమైనా, దూరంగా ఉన్న చుట్టాలతో కొంచెం ఎక్కువ సేపు మాట్లాడాలన్నా కుదిరేది కాదు. 40 నిమిషాల సమయం అయిపోగానే ఆటోమేటిక్‌గా కాల్ కట్ అయిపోయేది. దీంతో చాలామంది ఇబ్బందులు పడేవారు. అయితే ఇలా ఇబ్బందులు పడుతున్న వారికి జూమ్ సంస్థ ఓ తీపి కబురు చెప్పింది. పాశ్చాత్యులు గొప్పగా జరుపుకునే ‘థ్యాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా ఈ 40 నిమిషాల నిబంధనను తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా చేయడం వల్ల కుటుంబాలు తమ బంధువులతో ఎక్కువసేపు ముచ్చట్లు చెప్పుకునే అవకాశం ఉందని కంపెనీ అధికారులు చెప్పారు. నవంబరు 26న థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ నెల 26 అర్ధరాత్రి నుంచి 27 తెల్లారేవరకూ ఈ 40 నిమిషాల నిబంధన వర్తించదని పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఈ ప్రకటన చూసిన నెటిజన్లు జూమ్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. పండుగ వేళ మంచి గిఫ్ట్ ఇచ్చారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నిబంధనను తొలగించడం వల్ల పండుగ పూట కుటుంబంతో ఎక్కువ సేపు గడిపిన అనుభూతి ఉంటుందని చెప్తున్నారు. ఇలా టైం నిబంధనల ఒక్క జూమ్‌కే కాదు.. వీడియో కాలింగ్ సదుపాయం కల్పించే దాదాపు అన్ని సంస్థలూ సమయం పరిమితి విధిస్తూనే ఉన్నాయి. గూగుల్ మీట్ 60 నిమిషాలు, సిస్కో వెబెక్స్ 50 నిమిషాలు మాత్రమే ఉచిత వీడియో కాలింగ్ సదుపాయం అందజేస్తాయి. ఆ టైం అయిపోగానే కాల్ కట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి