మొబైల్ కంపెనీలలో వివో కంపెనీ కూడా ఒకటి.. సరికొత్త ఫీచర్స్ తో , యువతను ఆకట్టుకునే విధంగా ఈ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి..అందుకే అంటారు యువత ఫోన్లకు మరో ప్రాణం అని.. ఎటువంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా కూడా ఈ ఫోన్లను కొనడం తో పాటుగా మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తారు.. అందుకే ఇప్పుడు వివో కంపెనీ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది..ఆ ఫోన్ వివో వీ20 ప్రో..ఈ ఫోన్ ను డిసెంబర్ రెండున మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది..



జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది..సుమారు రూ.36,600 వేలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. మూన్ లైట్ సొనాటా, మిడ్ నైట్ జాజ్, సన్ సెట్ మెలోడీ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు..



ఇక ఈ ఫోన్ కెమెరాల విషయానికొస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.. సెల్ఫీ కోసం 44 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది..మనదేశ వేరియంట్లో మాత్రం ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను అందించే అవకాశం ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు.. 5జి, 4జి నెట్ వర్క్ లు పనిచేస్తాయి.బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.పాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: