కరోనా వైరస్ కు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. అప్పటి వరకూ ఆరోగ్యంగా తిరుగుతున్న వ్యక్తులను అమాంతం మింగేస్తున్నా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఈ వైరస్ ను అడ్డుకోవడం చాలా కష్టంగా మారింది. కొంతమంది ఆక్సిజన్ అందక ఊపిరి వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు తమ శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
మీకు కొవిడ్ పాజిటివ్ ఉన్నా లేకున్నా తప్పకుండా మీ వద్ద పల్స్ ఆక్సీమీటర్ ను ఉంచుకోండి. దీని ద్వారా మీ శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చు. మీ దగ్గర ఆక్సిమీటర్ ఉంటే సరిపోదు. ఇందుకుగాను మీకు 6 నిమిషాల నడక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా మన శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని కరెక్ట్ గా తెలుసుకోవచ్చు.
1). కరోనా బాధితుల్లో ఆక్సిజన్ స్థాయిలు క్రమరహితంగా ఉంటాయి కాబట్టి.. పల్సర్ మీటర్ ద్వారా ప్రతి సారి చెక్ చేసుకుంటూ ఉండాలి.
2). ఈ ఆక్సిమీటర్ ను మన చేతి వేళ్ళ కి ఉంచుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు.
3). ఈ ఆక్సిమీటర్ వేలికి ఉంచిన తర్వాత ఒక గదిలో 6 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.
4). ఆ తరువాత ఆక్సీమీటర్ ద్వారా మీ ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోవచ్చు.
5). రోజుకు కనీసం మూడు సార్లు అయినా ఇలా చెక్ చేసుకోవాలి.
6). ముందుగా మీరు నమోదు చేసుకున్న ఆక్సిజన్ శాతం కంటే 3% తక్కువగా ఉంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
7). ఆక్సి మీటర్ రీడింగ్ 94 శాతం కంటే ఎక్కువ నమోదయితే ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నట్లే.
8). 94 శాతం కంటే తక్కువ నమోదయితే ఆక్సిజన్ స్థాయి తగ్గుతున్నట్టు అని తెలుసుకోవాలి. అలా చూపించినట్లు అయితే మీరు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
ప్రతి ఒక్కరూ మీలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకొని, దాని తర్వాత కావలసిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఏదైనా సమస్య వచ్చే వరకూ ఆగడం కంటే ముందే తెలుసుకొని పరిష్కరించుకోవడం చాలా ఉత్తమమైన పని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి